News October 15, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్‌పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్‌లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.
News October 15, 2025
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం

విజయవాడలో బుధవారం స్టెరాయిడ్స్ కలకలం రేగింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్‌ను సుమారు 10 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2025
అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.