News February 17, 2026

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఉప్పల్‌వాయి యువకుడు మృతి

image

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన జంగిటి రాజు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వెన్నెల డిబేట్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News February 21, 2026

జోగులాంబ గద్వాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాక

image

గద్వాల జిల్లాకు రేపు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ రానున్నారు. ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

News February 21, 2026

మంచిర్యాల: 23 నుంచి యథాతథంగా ‘ప్రజావాణి’

image

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈ నెల 23 నుంచి పునఃప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ యథాతథంగా కొనసాగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేసి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News February 21, 2026

T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

image

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్‌లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.