News February 14, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఏఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ జీఎంఆర్, ఆర్అండ్‌బీ ఏఈ, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, కామారెడ్డి ఆర్టీసీ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్లలో ఇక ముందు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News November 15, 2025

విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

image

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్‌ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్‌ ఆసక్తి చూపింది.

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/

News November 15, 2025

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి: కలెక్టర్

image

బాపట్ల జిల్లా టూరిజంకు ప్రసిద్ధి చెందిందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో సూర్యలంక బీచ్, రామాపురం బీచ్‌లకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారని, అక్కడ రిసార్ట్‌లు బాగా అభివృద్ధి చెందాయని, పరిసరాలను ఎల్లవేళలా పరిశ్రమంగా ఉంచి, పర్యాటకులను ఆకర్షించాలన్నారు. పర్యాటకులు ఎక్కువగా జిల్లాకు వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుందని తద్వారా జీడీపీ రేటు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.