News October 20, 2025

కామారెడ్డి: రోడ్లపై మృత్యు రాశులు

image

రైతుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలను పోతున్నాయి. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ నెల 18న కామారెడ్డి జిల్లా తాడ్వాయి PS పరిధిలో రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న కుప్పపై బైక్ దూసుకెళ్లడంతో గంగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. రైతుల నిర్లక్ష్యంపై వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News October 20, 2025

జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

image

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

News October 20, 2025

మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

image

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News October 20, 2025

VKB: అనంతపద్మనాభ స్వామి ఆలయం మూసివేత

image

వికారాబాద్‌కు సమీపంలోని మహిమాన్విత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అమావాస్యను పురస్కరించుకుని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ నరేందర్ తెలిపారు. నిత్యం భక్తులు సందర్శించి, మొక్కులు తీర్చుకునే ఈ ఆలయాన్ని అమావాస్య ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి తెరుస్తామని ఆయన వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.