News December 10, 2025
కామారెడ్డి: విదేశీ ఉన్నత విద్య శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులకు కామారెడ్డి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ వెంకన్న తెలిపారు. ఈ శిక్షణతో పాటు స్కాలర్‌షిప్‌లు పొందేందుకు కూడా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆసక్తి గల బీసీ విద్యార్థులు ఈనెల 21వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 10, 2025
అన్నమయ్య: జిల్లాల విభజన.. తెరమీదికి మరో డిమాండ్.!

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు మండలం ఎంపీటీసీలు కోరారు. రైల్వే కోడూరు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు మధ్యలో ఉందని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారని మదనపల్లిని విభజించిన తర్వాత రాజంపేట అన్నమయ్య మధ్యలో ఉందన్నారు. రాజంపేట వీలు కాకుంటే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు.
News December 10, 2025
రొయ్యల పరిశ్రమల్లో కూలీలకు భద్రత: కలెక్టర్

రొయ్యల పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళల సంక్షేమం, భద్రత కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రొయ్యల సినర్జీ ప్రాజెక్టులో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాల కొరకు మత్స్య, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార యాత్ర వాహనాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
News December 10, 2025
ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.


