News December 29, 2025
కామారెడ్డి: వృద్ధురాలి హత్య.. నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు.. లింగంపేట(M) పోల్కంపేటకు చెందిన సులోచన(67) ఈ నెల 27న తన ఇంట్లో రక్తపు గాయాలతో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ముద్రబోయిన కుమార్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి దొంగిలించిన 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునామన్నారు.
Similar News
News January 7, 2026
ములుగు: గుండెలు పిండేసే ఘటన

వెంకటాపూర్(M) ఇంచెంచెరువుపల్లిలో గుండెలుపిండేసే ఘటన చోటుచేసుకుంది. హర్కవత్ లక్ష్మి-లచ్చిరాం దంపతులకు యాకుబ్(30) ఒక్కడే కుమారుడు. కొన్నేళ్లక్రితం లచ్చిరాం మరణించాడు. కిడ్నీ వ్యాధితో నిన్న రాత్రి యాకుబ్ కన్నుమూశాడు. దీంతో తల్లి లక్ష్మి ఒంటరైంది. బాధను దిగమింగుతూ కొడుకు చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. నిరుపేద అయిన లక్ష్మిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
News January 7, 2026
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మరోసారి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.
News January 7, 2026
NTR: Way2News కథనాలకు అధికారుల స్పందన.!

తిరువూరు మెప్మా పరిధిలో రూ.17కోట్ల రుణాల గోల్‌మాల్‌పై ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. Way2News కథనాలకు స్పందించిన రాష్ట్ర మెప్మా కార్యాలయం, ఆరుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపింది. బుధవారం తిరువూరు మెప్మా కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన బృందం.. డ్వాక్రా మహిళల పేరిట మంజూరైన రుణాలపై ఆరా తీసింది. వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశామని, విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.


