News April 11, 2025
కామారెడ్డి: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News February 21, 2026
కాకినాడ: టెన్త్ అర్హతతో 150 ఖాళీలకు జాజ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24న పలు కంపెనీల్లో 150 ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వాఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. టెన్త్ -డిగ్రీ అభ్యర్థులు నకలులతో ఉదయం 10గం.లకు హాజరు కావాలన్నారు.
News February 21, 2026
NLG: నిరుద్యోగులకు అలర్ట్.. రేపే ఆఖరి గడువు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, RRB, SSC పరీక్షలకు ఉచిత శిక్షణ పొందేందుకు నిరుద్యోగులకు రేపే (ఫిబ్రవరి 22) ఆఖరి అవకాశం. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ శిక్షణను నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి బి. శశికళ సూచించారు. అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News February 21, 2026
VASTHU: ఏ అంతస్తులో ఎవరు ఉండాలి?

కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదాలను నివారించడంలో వాస్తుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరించారు. అంతస్తులు గల భవనాలను సోదరులు ఏవిధంగా పంచుకోవాలో సూచించారు. ‘పై అంతస్తులో చిన్నవారు ఉండాలి. కింద పెద్దవారు నివసించాలి. సభ్యుల సంఖ్యను బట్టి ఈ క్రమాన్నే పాటించాలి. తద్వారా సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మనస్పర్థలు రావు. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


