News January 23, 2025
కామారెడ్డి: షబ్బీర్ అలీని కలిసిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కామారెడ్డి పట్టణంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య బృందం గురువారం కలిసింది. డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బోధన రుసుములను త్వరగా విడుదల చేయాలని కోరారు. దీనిపై షబ్బీర్ అలీ స్పందిస్తూ వీలైనంత త్వరలో పెండింగ్లో ఉన్న బోధన రుసుములను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు.
Similar News
News September 15, 2025
మంచిర్యాలలో కలకలం రేపిన జేఎల్ఏం ఆత్మహత్యాయత్నం

మంచిర్యాలలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం భవనం పైనుంచి దూకి జూనియర్ లైన్ మెన్ బూసి రాజు ఆత్మహత్యాయత్నం చేయడం సోమవారం కలకలం రేపింది. చెన్నూర్ లైన్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన తన తండ్రి వందనం మరణించగా.. రాజుకు ఉద్యోగం లభించింది. తన తల్లి రోజామణికి పెన్షన్, హెల్త్ కార్డు మంజూరులో జాప్యం చేస్తున్నారని రాజు తెలిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.
News September 15, 2025
గద్వాల: రేపు ఈవీఎంల తనిఖీలు

ఈవీఎంలను మంగళవారం తనిఖీ చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఈ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.
News September 15, 2025
విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్‌టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.