News January 4, 2026

కామారెడ్డి: సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు రివార్డులు

image

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలనిస్తోంది. తీవ్ర చలిలోనూ అప్రమత్తంగా వ్యవహరించి గంజాయి రవాణాను అడ్డుకున్న ఏఎస్ఐ నరసయ్య, సిబ్బంది సుబ్బారెడ్డి, రెడ్డి నాయక్, సంతోష్, బలరాం, భూపతిలను SP రాజేష్ చంద్ర అభినందించారు. వీరికి నగదు రివార్డులు అందజేశారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని SP విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 29, 2026

పోలవరం జిల్లాలో 47,318 మందికి పింఛన్లు

image

పోలవరం జిల్లాలో 47,318మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు అయ్యాయని జిల్లా అధికారులు గురువారం తెలిపారు. ఇందు నిమిత్తం రూ.19,73,83,000 ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. అత్యధికంగా రాజవొమ్మంగి మండలంలో 6,291మందికి, అత్యల్పంగా మారేడుమిల్లికి 2,817మందికి మంజూరు అయ్యాయని వెల్లడించారు. జనవరి 31న ఇళ్ల వద్ద లబ్ధిదారులు అందుబాటులో ఉండి పింఛను అందుకోవాలని సూచించారు.

News January 29, 2026

మేడారం: దుష్ప్రచారాలు నమ్మొద్దు: పొంగులేటి

image

మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రి పొంగులేటి అన్నారు. దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

News January 29, 2026

వనదేవతలను 80 లక్షల మంది దర్శించుకున్నారు: పొంగులేటి

image

మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మేడారంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న, నేడు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని అన్నారు. సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.