News January 13, 2026
కామారెడ్డి: సమ్మె బాటలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు

గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె బాటకు వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్య కు సమ్మె నోటీసు అందించారు. వారు మాట్లాడుతూ.. రేయింబవళ్ళు కష్టపడుతున్న తమకు వేతనాలు సరైన సమయానికి అందించకపోవడమే కాకుండా తాత్సారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆమెకు తెలిపారు.
Similar News
News February 8, 2026
ఈవారం మూడు IPOలు.. ₹3,871 కోట్ల సమీకరణ

ఈవారం ఇన్వెస్టర్లకు 3 IPOలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ₹3,871 కోట్లు సమీకరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఫ్రాక్టల్ అనలిటిక్స్ (₹2,834 కోట్లు), NBFC Aye Finance (₹1,010 కోట్లు) IPOలు ఫిబ్రవరి 9న ప్రారంభమై 11న ముగియనున్నాయి. వీటితో పాటు SME విభాగంలో మరుషిక టెక్నాలజీ IPO ఫిబ్రవరి 12న మొదలవుతుంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఇవి భారీగా నిధులు సేకరించాయి.
News February 8, 2026
VKB: రేపటి నుంచి APPLY చేసుకోండి: కలెక్టర్

అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ల కోసం రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఉందన్నారు. ఆయా పత్రికా సంస్థల ధ్రువీకరణతో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు డీపీఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News February 8, 2026
వేములవాడలో పోలీసుల కవాతు.. హాజరైన ఏఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి నేతృత్వంలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు తిప్పాపూర్ బస్టాండు నుంచి వేములవాడ పట్టణ వీధుల మీదుగా కోరుట్ల బస్టాండ్ వరకు కవాతు నిర్వహించాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


