News February 6, 2025
కామారెడ్డి: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో సుమారు 501 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.