News April 12, 2025
కామారెడ్డి: ‘సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలి’

కామారెడ్డిలో గల 250 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంత్రి దమోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు హైదరాబాదులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం లేకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News September 14, 2025
ఎల్.ఐ.సీ కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్‌గా ఆమందు రాజ్‌కుమార్ ఎన్నిక

ఎల్.ఐ.సీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్‌గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీకాంతం, రౌతు నర్సయ్యను ఎన్నుకున్నారు. మంచిర్యాలలో జరిగిన మహాసభలో గాదాసు శ్రీనివాస్ కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఎన్నికైన వారికి జగిత్యాల బ్రాంచ్ అభినందనలు తెలిపింది.
News September 14, 2025
జూబ్లీహిల్స్: వర్షంలోనూ మాగంటి కుమార్తెల పర్యటన..!

జూబ్లీహిల్స్‌లో BRSని ప్రజలు గెలిపించాలని మాజీ MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర కోరారు. ఈ మేరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈరోజు నియోజకవర్గ పరిధి రహమత్‌నగర్ డివిజన్ ఓం నగర్ కాలనీలో పర్యటించారు. BRSమహిళా నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతోనే తమ తండ్రి గోపీనాథ్ 3సార్లు గెలిచారన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.