News February 3, 2025
కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News February 3, 2025
HYD: యాక్సిడెంట్.. MLA గన్‌మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 3, 2025
‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ రివీల్ అయింది. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. డార్లింగ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 3, 2025
GNT: SI అంటూ బెదిరించి రూ.24లక్షలు స్వాహా
ఎస్ఐ అంటూ బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలు దోచేసిన వైనంపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నెహ్రు నగర్‌కి చెందిన నాగేశ్వరరావుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎస్ఐ ప్రసాద్‌ను అని చెప్పాడు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నాడు. ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయని నాగేశ్వరావుని బెదిరించి విడతల వారీగా రూ.24లక్షలు నకిలీ ఎస్ఐ ఖాతాలోకి జమ చేయించుకున్నాడు.