News March 4, 2026

కామారెడ్డి: సులభమైన మార్కెటింగ్ విధానాన్ని అమలు చేయాలి

image

ఈ-నామ్ విధానం ద్వారా రైతులకు పారదర్శకతతో కూడిన సులభమైన, లాభదాయకమైన మార్కెటింగ్ వ్యవస్థను అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మద్నూర్ ఏఎంసీలో ఈ-నామ్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, కార్యదర్శులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Similar News

News March 6, 2026

భూ కబ్జాలకు నిలయంగా సున్నిపెంట

image

శ్రీశైల మండల కేంద్రమైన సున్నిపెంట భూ కబ్జాలకు నిలయంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇష్టానుసారంగా భూ కబ్జాలను ప్రోత్సహిస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. చివరికి శ్మశాన స్థలాలను కూడా ఆక్రమించే పరిస్థితి నెలకొంది. పూర్ణానంద ఆశ్రమం సమీపంలోని దళితుల శ్మశాన వాటికను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించటంతో అటవీశాఖ అధికారులు స్పందించి పరిశీలించారు.

News March 6, 2026

GNT: ‘రైతుల యోగక్షేమాలు చూడనప్పుడు భూసేకరణ ఎందుకు ?’

image

ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగా శుక్రవారం బ్రాడీపేట UTF కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అన్నీ కోణాల్లో ఆలోచన చేయలన్నారు. 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతుల యోగక్షేమాల బాధ్యత చంద్రబాబుపై ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదని, అటువంటప్పుడు 2వ విడత సేకరణ ఎందుకని ప్రశ్నించారు.

News March 6, 2026

BiPC స్టూడెంట్స్‌‌కు ఏయే కోర్సులున్నాయంటే?

image

<<19303162>>ఇంటర్‌లో<<>> BiPC చేసిన వారికి మెడిసిన్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశపరీక్షల ద్వారా MBBS, ఆయుర్వేద, హోమియో, వెటర్నరీల్లో చేరొచ్చు. డిగ్రీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ కోర్సులకు డిమాండ్ ఉంది. నర్సింగ్, ఫిజియోథెరపీలాంటి పారామెడికల్ కోర్సులు.. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీలో BSc చేయొచ్చు. రేపు 2PMకు MEC..