News July 13, 2024
కామారెడ్డి: సూసైడ్ నోట్ రాసి రికార్డు అసిస్టెంట్ సూసైడ్

రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డిలో చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ (28) తాడ్వాయి MRO ఆఫీస్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్ వేధింపులు భరించలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు DSP నాగేశ్వరరావు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
ఆర్మూర్: దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్మూర్ శివారులో శనివారం సాయంత్రం దంపతులు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం పడిగేలా గ్రామం వడ్డెర కాలనికి చెందిన రవితేజ, భార్య శోభ పట్టణ శివారులోని ఓ వెంచర్‌లో విషం తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
News January 11, 2026
NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.
News January 11, 2026
NZB: చైనా మాంజా విక్రయాలపై పోలీసుల తనిఖీలు

చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు NZB, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ల పరిధిలో భారీగా తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజా ఎవరైనా విక్రయించినా, నిల్వ, రవాణా చేసినా నేరమేనని సీపీ తెలిపారు. చైనా మాంజా విక్రయం వల్ల, జంతువులకు, పక్షులకు, మనుషులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


