News August 29, 2025
కామారెడ్డి: హమ్మయ్యా.. వరుణుడు శాంతించాడు.!

మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఈరోజు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరదలు, జలమయమైన రహదారులతో కకావికలం అయిన జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉదయం నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. అధికార యంత్రాంగం పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి.
Similar News
News August 29, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 5వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
News August 29, 2025
తిరుపతి: కనువిందు చేసిన ఆకాశం

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో శుక్రవారం సాయంత్రం ఆకాశం బంగారంలా మారినట్లు దగదగలాడింది. 6.37 గంటల సమయంలో ఇలా మారింది. దాదాపు నాలుగు నిమిషాలు ఆకాశం ఇలా ఎర్రగా దర్శనమిచ్చింది. ఇలా అరుదుగా జరుగుతుంటుందని పలువురు తెలిపారు. మరి మీ ఏరియాలోనూ ఆకాశం ఇలానే కనిపించిందా? లేదా? కామెంట్ చేయండి.
News August 29, 2025
విశాఖ రేంజ్ పరిధిలో 12 మంది సీఐలకు బదిలీ

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో 12 మంది సీఐలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో నీలయ్య, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, రంగనాథం, సత్యనారాయణ రెడ్డి, రమేశ్, గోవిందరావు, శ్రీనివాసరావు, రమణ, మూర్తి, చంద్రశేఖర్, బంగారు పాప ఉన్నారు. త్వరలో వారి వారి స్థానాల్లో ఛార్జ్ తీసుకోనున్నారు.