News February 24, 2025
కామారెడ్డి: హామీల అమల్లో సీఎం మోసం: ఎంపీ

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డిలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.
Similar News
News February 24, 2025
CRICKET: ఈ రోజు చాలా స్పెషల్ గురూ..

క్రికెట్ చరిత్రలో వేర్వేరు సంవత్సరాల్లో ఈ రోజు(FEB 24)న పలు రికార్డులు నమోదయ్యాయి. 2010లో సౌతాఫ్రికాపై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశారు. అంతర్జాతీయ వన్డేల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. 2013లో మిస్టర్ కూల్ ధోనీ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇక 2015లో విండీస్ క్రికెటర్ గేల్ వన్డే వరల్డ్ కప్‌లో ద్విశతకం బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కారు.
News February 24, 2025
పల్నాడు జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పల్నాడు జిల్లా ఆసుపత్రిని సోమవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.రంగారావును వైద్య సేవల వివరాలడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రోగులను పలకరించి మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి, విజువల్ సర్టిఫికెట్లు వివరాలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సర్టిఫికెట్ల సమాచారం ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.
News February 24, 2025
పెద్దపల్లి: రేపు ప్రభుత్వ హాస్పటల్‌లో డాక్టర్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ఫిబ్రవరి 25న గైనకాలజిస్ట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (గైనకాలజిస్ట్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 8499061999ను సంప్రదించాలని సూచించారు.