News January 29, 2025
కామారెడ్డి: ‘హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి’

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటించాలని వివరించారు.
Similar News
News July 9, 2025
మాతృభూమికి సేవ చేయడం అభినందనీయం: కలెక్టర్

జన్మభూమికి సేవ చేయాలనే సంకల్పంతో పలు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మూడేళ్లుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. యూఎస్ఏకు చెందిన చిక్కాల విద్యాసాగర్ ముందున్నారని కలెక్టర్ ప్రశంసించారు.
News July 9, 2025
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మహర్దశ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్‌పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.
News July 9, 2025
ASF: ఉప్పొంగిన ప్రాణహిత

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.