News September 11, 2025
కామారెడ్డి: హైవేపై 26 గొర్రెలు మృతి

కామారెడ్డి మండలంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ వెల్లడించారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.
Similar News
News September 11, 2025
HYD: మీరు వినరు.. వారు వదలరు

గణేశ్ ఉత్సవాల్లో హైదరాబాద్ షీ టీమ్స్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. 1,612 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. పట్టుబడ్డ వారిలో 1,544 మంది పెద్దలు, 68 మంది ఉన్నారు. ఇందులో 168 పెట్టి కేసులు నమోదు చేయగా.. 70 కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొందరికి జరిమానా, ఒకరికి 2 రోజుల సింపుల్ జైలు శిక్ష, 1,444 మందికి వార్నింగ్, కౌన్సెలింగ్ కోసం పిలిచి అవగాహన కల్పించారు.
News September 11, 2025
GNT: కానిస్టేబుల్ కొడుకు నుంచి డీజీపీ స్థాయికి ఎదిగారు

మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో 1955 సెప్టెంబర్ 11న జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు కానిస్టేబుల్, 1979లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌గా నియమితులైన తరువాత కూడా ఉన్నత చదువులు చదివారు. సెప్టెంబర్ 30, 2013న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఫిజిక్స్‌పై మక్కువతో తరంగ సిద్ధాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రీసెర్చ్ చేస్తూనే ఉండేవారు.
News September 11, 2025
రేపు పాడేరులో ఆరోగ్య పరీక్ష శిబిరం

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం (రేపు) ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు తెలిపారు.