News September 20, 2025
కామారెడ్డి: 11 మందికి జైలు.. 22 మందికి జరిమానా

మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కోర్టు మొత్తం 33 మందికి శిక్ష విధించింది. ఇందులో 11 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, 22 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.
Similar News
News September 20, 2025
నిర్మల్: ‘ఎంప్లాయిమెంట్ కార్డు దరఖాస్తు చేసుకోండి’

ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరి అని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఐ.గోవింద్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు తమ శాఖ మంచి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయాన్ని లేదా మీ-సేవ/ఆన్‌లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించారు.
News September 20, 2025
చకచకా చరణ్-సుకుమార్ మూవీ స్క్రిప్ట్ వర్క్

రామ్ చరణ్-బుజ్జిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత సుకుమార్-చెర్రీ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్, ప్రీవిజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ మాత్రమే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారు.
News September 20, 2025
వరంగల్: సోషల్ మీడియాలో మీ అడ్రస్ పెట్టొద్దు!

సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత అడ్రస్ పెట్టొద్దని, మీ వ్యక్తిగత సమాచారం చాలా కీలకమని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియా ప్రొఫైల్‌లో వివరాలు ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని, మీరు ఇచ్చే వివరాలే సైబర్ మోసాలకు దారితీస్తాయన్నారు. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌కు లాక్ ఉపయోగించాలని, అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్టులతో అప్రమత్తం ఉండాలని సూచించారు.