News December 19, 2025

కామారెడ్డి: 17 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్.. ఉష్ణోగ్రతల తగ్గుదల

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఆరెంజ్ అలర్ట్ లో ఉందని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మేనూర్ 8.4°C, డోంగ్లి 8.6, రామలక్ష్మణపల్లి 8.9, సర్వాపూర్, దోమకొండ, గాంధారి, లచ్చపేట 9.2, బీర్కూర్ 9.4, నస్రుల్లాబాద్ , బొమ్మన్ దేవిపల్లి, పెద్దకొడప్గల్, ఎల్పుగొండ 9.5, జుక్కల్ 9.6, నాగిరెడ్డిపేట 9.7, పుల్కల్, బిచ్కుంద 9.8°C లుగా నమోదయ్యాయి.

Similar News

News December 22, 2025

వరంగల్: మాజీ ACP, CI, SI సస్పెండ్

image

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్‌తో పాటు ప్రస్తుతం సీసీఎస్ CI గోపి, ఎస్ఐ విఠల్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఫిర్యాదులందడంతో, దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.

News December 22, 2025

జగిత్యాల: డూప్లికేట్, బ్లర్ ఎంట్రీల సవరణపై దృష్టి

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తహశీల్దార్లను ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, సమాన వివరాలు, బ్లర్ ఫోటోలు సరిదిద్దాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు.

News December 22, 2025

రామగుండం: లోక్ అదాలత్‌లో 4,411 కేసులు పరిష్కారం

image

RGM పోలీస్ కమిషనరేట్ పరిధిలో DEC 21న జరిగిన జాతీయ మెగాలోక్ అదాలత్‌లో మొత్తం 4,411కేసులు పరిష్కరించామని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇందులో IPC-386, SLL-16, ఈ-పెట్టీ-2,971, డ్రంక్ & డ్రైవ్ కేసులు-1,038 ఉన్నాయన్నారు. ముఖ్యంగా 59 సైబర్ కేసుల్లో బాధితులకు ₹53,24,105 రీఫండ్ చేశామన్నారు. కేసుల రాజీ కోసం 15 రోజులుగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించగా.. లక్ష్యానికి మించి పరిష్కారం నమోదైందని అన్నారు.