News September 5, 2025
కామారెడ్డి: 300 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో నిఘా

కామారెడ్డిలో గణేశ్ నిమజ్జన, శోభాయాత్రల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. 300 మంది పోలీసులు, 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP కోరారు.
Similar News
News September 6, 2025
జగిత్యాల: రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్న అధ్యాపకులు

జగిత్యాల SKNR ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో జంతు శాస్త్ర సహాయచార్యులు పర్లపల్లి రాజు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ నీలి వాసవి శుక్రవారం రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, వీసీలు ఉమా శంకర్, ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
News September 6, 2025
వేములవాడ: మహిళ సాధికారతపై విద్యార్థులకు అవగాహన

వేములవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో 10 రోజుల మహిళా సాధికారికత అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజు మహిళా శిశు సంక్షేమ పథకాలు, టోల్ ఫ్రీ నంబర్లు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ విషయాలు వివరించారు. డిజిటల్ టెక్నాలజీ దుర్వినియోగం ప్రభావాలు, వాటి నుంచి రక్షణ మార్గాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పాల్గొన్నారు.
News September 6, 2025
నిమజ్జనాన్ని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

నర్సంపేటలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద శుక్రవారం రాత్రి పరిశీలించారు. పట్టణ శివారు దామర చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఎన్ని విగ్రహాలు, ఏర్పాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ, ఆర్డీవో ఉమరాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులున్నారు.