News August 13, 2025
కామారెడ్డి: ‘4 నెలల్లో 2,300 కేసుల పరిష్కారం’

ఇటీవల కొత్తగా ఏర్పడిన రాష్ట్ర సమాచార కమిషన్ గత నాలుగు నెలల్లో పెండింగ్‌లో ఉన్న 18,000 కేసులలో 2,300కు పైగా కేసులను పరిష్కరించిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ మోహ్సినా పర్వీన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన RTI అవగాహన సదస్సులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె RTI చట్టం అమలుపై అధికారులకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
Similar News
News August 14, 2025
తాండూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన తాండూరులో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ యార్డులో ఓ వ్యక్తి (55) గుర్తుతెలియని రైలు కిందపడి చనిపోయాడు. మృతుడి చొక్కాపై శ్రీను టైలర్స్ శంకర్‌పల్లి అని రాసి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 7702629707 నంబర్‌కు కాల్ చేసి, సమాచారం ఇవ్వాలన్నారు.
News August 14, 2025
‘సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించం’

సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని AITUC అధ్యక్ష, కార్యదర్శులు V.సీతారామయ్య, K.రాజ్‌కుమార్ అన్నారు. బుధవారం గోదావరిఖనిలో AITUC సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా విమర్శలు చేయడం INTUC విధానమా అని ప్రశ్నించారు.
News August 14, 2025
ASF: ‘వర్షపు నీటి నిల్వలను తొలగించాలి’

ASF జిల్లాలోని నివాస ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం ఆయన ఆసిఫాబాద్‌లోని పైకాజీనగర్‌లో నీటి నిల్వలను, వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.