News April 10, 2025

కామారెడ్డి: 76కు చేరుకున్న కల్తీ కల్లు బాధితులు

image

కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ బీర్కూర్ గాంధారి మండలాల్లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గత మూడు రోజులుగా 24 మందిని కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. బాన్సువాడ ఆసుపత్రికి బుధవారం ముగ్గురు బాధితులు రాగా, ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని ఒకరు అడ్మిట్ అయ్యారని వైద్యులు తెలిపారు.

Similar News

News February 22, 2026

సంగారెడ్డి: నేడే గురుకుల ప్రవేశ పరీక్ష

image

తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో 8,598 మంది పరీక్షకు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (టీజీ సెట్ )పరీక్ష రాయనున్నారు. ఆధార్ కార్డ్ హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు.

News February 22, 2026

కర్నూలు KV సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద మృతి

image

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బేతంచెర్లకు చెందిన విజయ్ కుమార్(27)గా గుర్తించారు. కర్నూలులోని KV సుబ్బారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News February 22, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.