News February 3, 2025
కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.
Similar News
News February 3, 2025
HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్
లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
News February 3, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.