News September 6, 2025

కామారెడ్డి: GPOలు అంకిత భావంతో పనిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎంపికైన GPOలు అంకిత భావంతో పని చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సూచించారు. శనివారం GPOలు మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిశారు. గ్రామాల్లో రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నియమించిందని గుర్తు చేశారు.

Similar News

News September 7, 2025

క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రెండు కమిటీలు

image

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. అపెక్స్, ఎక్స్‌పర్ట్ కమిటీల విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ కంప్యూటింగ్, డిఫెన్స్ టెక్నాలజీ కేంద్రంగా మార్చాలని చూస్తోంది.

News September 7, 2025

ఆదిలాబాద్: ‘ప్రధాని మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం’

image

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఎంపీల వర్క్ షాప్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు నగేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

News September 7, 2025

వేముల వద్ద రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఎర్రవల్లి మండలం వేముల స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. హైవే సిబ్బంది తెలిపిన వివరాలు.. HYD నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తి(45)ని ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. మృతుడు పసుపుపచ్చ గళ్ల చొక్కా, నలుపు-తెలుపు గీతలతో ఉన్న ప్యాంటు ధరించి ఉన్నాడు.