News March 7, 2026

కామారెడ్డి: HPV వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు పూర్తైన బాలికల HPV వ్యాక్సిన్ ఆదివారం నుంచి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన టీకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 9, 2026

పాలమూరు: ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

image

MBNRలోని రాజేంద్రనగర్‌లో DDU-GKY & స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవికుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామని, ఈనెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 99496 98592కు సంప్రదించాలన్నారు.
SHARE IT

News March 9, 2026

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 9, 2026

పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై ఉత్కంఠ

image

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ సభ ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే సభకు సమయం తక్కువగా ఉండటంతో సోమవారం నాటికి ఎటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం. దీనిపై అటు శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.