News May 14, 2024
కారంచేడు: భర్త మృతి.. ఆ బాధలోనూ ఓటేసిన భార్య

బాపట్ల జిల్లా కారంచేడులో ఓ మహిళ ఓటు విలువను చాటారు. గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఆమె భర్త సింగయ్య(62) మృతిచెందారు. కాగా, ఆ బాధలోనూ ఆమె ఓటు వేయాల్సిన బాధ్యతను మరవలేదు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి పలువురికి ఆమె ఆదర్శంగా నిలిచారు.
Similar News
News April 22, 2025
గుంటూరు వాహినిలో 25 వరకు తాగునీటి విడుదల

గుంటూరు జిల్లా తాగునీటి చెరువులను నింపాలని గుంటూరు వాహినికి ఈ నెల 25 వరకు తాగు నీటిని విడుదల చేస్తున్నామని, ఆయా తటాకాలను నీటితో నింపుకోవాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి సాంబశివరావు తెలిపారు. 25వ తేదీ తర్వాత మరమ్మతుల నిమిత్తం కాలువకు నీరు నిలిపివేస్తామని, రాబోయే రోజులలో పెదనందిపాడు మండల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.
News April 22, 2025
తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.
News April 22, 2025
తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.