News February 2, 2025
కారంపూడి: రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి మృతి

రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి ఆళ్ల అనిల్ కుమార్ (24)మృతిచెందిన ఘటన కారంపూడి మండలం ఒప్పిచర్ల పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పరిధిలోని కండ్రిక గ్రామం గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తూ పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల రైతులను కలిసి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. కారంపూడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 12, 2025
ఖమ్మం: మొంథా తుఫాన్.. ఎకరానికి రూ.10 వేలు పరిహారం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ నివేదించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని తాను కోరినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
News November 12, 2025
కామారెడ్డి: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మండలాల ప్రగతిపై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీఓ సురేందర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
News November 12, 2025
జగిత్యాల: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు: కలెక్టర్

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం నాచుపెల్లి JNTU కళాశాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కొడిమ్యాల, మల్యాల మండలాల రైస్ మిల్లర్లు, రైతులతో ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్షించారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు.


