News December 1, 2024
కారంపూడి వీరుల తిరుణాల్లో రెండోరోజు రాయబారం..
కారంపూడి వీరుల తిరుణాల్ల సందర్భంగా రెండోరోజు రాయబారం.. అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ల జీయర్ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.
Similar News
News January 14, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు వాసులు విజయం
సంక్రాతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పడవల పోటీల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామ పల్లెకారులు విజయం సాధించారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పడవల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న రామాపురం మత్స్యకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2025
గుంటూరు: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
గుంటూరు: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.