News June 5, 2024

కారుకు బ్రేక్… ప్రభావం చూపలేకపోయిన నామా

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 49.80గా నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లే సాధించి ఓటమి చవిచూశారు. 

Similar News

News November 29, 2024

KMM: డ్రగ్స్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ ప్రాధాన్యత అంశంగా అధికారులు పని చేయాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News November 28, 2024

KMM: ‘రైతు పండుగ నాటికి రైతు రుణమాఫీ పూర్తి’

image

సాంకేతిక కారణాలతో మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్మ ఖాతాల్లో జమ కాలేదని, దానిని మహబూబ్ నగర్‌లో నిర్వహించే రైతు పండుగ నాటికి క్లియర్ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బియ్యాన్ని విదేశాల వారు కోరుకుంటున్నారని చెప్పారు.

News November 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన