News January 28, 2026

‘కారుణ్య నియామకాల్లో మానవత్వమే ప్రధానం’

image

AP: ఉద్యోగి మరణం లేదా అనారోగ్య కారణాలతో పదవీ విరమణ ఆ కుటుంబానికి ఆర్థిక మరణంగా మారకూడదని HC స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలను సాంకేతిక కారణాలతో ఏకపక్షంగా తిరస్కరించొద్దని సూచించింది. విజయనగరం జిల్లాకు చెందిన నారాయణమ్మ కేసులో ఐదేళ్ల గడువు పేరుతో ఉద్యోగం నిరాకరించడం తప్పేనని పేర్కొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మానవీయ కోణంలో చూడాలని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది.

Similar News

News February 11, 2026

మీ ‘ఓటు’ ఎక్కడుందో తెలుసుకోండిలా

image

TG: మున్సిపోల్ నేపథ్యంలో ఓటర్ స్లిప్‌ను ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా Te-Poll మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చని EC తెలిపింది. <>వెబ్‌సైట్<<>> ఓపెన్ చేసి Voter Portalపై క్లిక్ చేయాలి. అక్కడ డౌన్‌లోడ్ ఓటర్ స్లిప్ బై Epic ID అర్బన్ 2025పై ఎంటర్ చేయగానే ఓపెన్ అయ్యే విండోలో వివరాలు ఎంటర్ చేసి ఓటర్ స్లిప్ పొందవచ్చు. అలాగే Te-Poll యాప్‌లో డాష్ బోర్డులో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేసి పొందవచ్చు.

News February 11, 2026

US-బంగ్లా డీల్.. భారత్‌కు దెబ్బ!

image

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం భారత టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం చూపించనుంది. US మెటీరియల్స్‌(కాటన్, మ్యాన్ మేడ్ టెక్స్‌టైల్స్)తో తయారు చేసిన వస్తువులను జీరో టారిఫ్స్‌తో ఎగుమతి చేసేందుకు బంగ్లాకు అవకాశం దక్కనుంది. కానీ మన వస్త్ర ఎగుమతులపై మాత్రం 18% సుంకం పడనుంది. బంగ్లా కాటన్ దిగుమతుల్లో గతంలో 70% ఇండియా నుంచే వెళ్లేది. ఇటీవల కొంత తగ్గగా, తాజా డీల్‌తో US కాటన్‌కే బంగ్లా మొగ్గుచూపనుంది.

News February 11, 2026

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.