News April 10, 2025
కారుమూరి, అంబటికి MLA మాస్ వార్నింగ్

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో బుధవారం జరిగిన సభలో MLA బొమ్మిడి నాయకర్ కారుమూరి, అంబటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘కారుమూరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట తీరు మార్చుకో. లేకుంటే తాటతీస్తాం. అంబటి రాంబాబు పద్ధతి మార్చుకోకుంటే నీ సొంత నియోజకవర్గంలో, కార్యకర్తల ముందే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించారు.
Similar News
News April 18, 2025
నరసాపురం: నేటి నుంచి తీరంలో అధికారులు సర్వే

చేపల వేటపై నిషేధం నేపథ్యంలో అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు మత్స్యకార భృతి అందించేందుకు సర్వే చేపడుతున్నట్లు నరసాపురం మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ ఎల్ఎన్ఎన్ రాజు తెలిపారు. ఈ నెల 18-23తేదీ వరకూ జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఒకేసారి సర్వే నిర్వహించనున్నారు. సిబ్బంది మత్స్యకారుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు తదితర వివరాలను సేకరించనున్నారు.
News April 18, 2025
ప.గో: తప్పులు లేకుండా పూర్తి చేయాలి..కలెక్టర్

ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరంలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై క్లెయిమ్స్ పరిష్కారం పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు14లక్షల 70వేల 886మంది ఉండగా వీరిలో పురుషులు 7లక్షల 20వేల 613మంది, మహిళలు 7లక్షల 50వేల 197మంది, ట్రాన్స్ జెండర్స్ 77మంది ఉన్నారన్నారు.
News April 17, 2025
పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.