News December 11, 2025

కారు ఢీకొని నటి వెన్నె డేవిస్ మృతి

image

హాలీవుడ్ నటి వెన్నె డేవిస్(60) రోడ్డు ప్రమాదంలో మరణించారు. న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఓ కారు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ది మార్వెలెస్ మిసెస్ మైసెల్, న్యూ ఆమ్‌స్టర్‌డ్యామ్, బ్లైండ్‌స్పాట్, షేమ్ వంటి సిరీస్‌లతో ఆమె పాపులర్ అయ్యారు. డిటెక్టివ్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించారు.

Similar News

News December 12, 2025

అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

image

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.

News December 12, 2025

రేవంత్-మెస్సీ మ్యాచ్‌కు రాహుల్ గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (శనివారం) హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్‌లో స్టార్ ప్లేయర్ మెస్సీ పాల్గొనే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్, ప్రియాంక ఇతర నేతలను ఆహ్వానించడం తెలిసిందే. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఆటగాళ్లు మెస్సీ టీమ్‌తో పోటీపడనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

News December 12, 2025

డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు: అశ్వినీ వైష్ణవ్

image

2027 జనగణన నిర్వహణకు ₹11,718 కోట్లను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. డేటా రక్షణను దృష్టిలో ఉంచుకుని జనాభా లెక్కల సమాచారం ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2027 జనాభా లెక్కలు మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కలు అవుతాయన్నారు. 2దశల్లో జనాభా లెక్కలు నిర్వహిస్తారని వివరించారు. ముందు గృహాల గణన, జాబితా తయారీ, ఆపై జనగణన ఉంటుందన్నారు.