News July 29, 2024

కార్గో వివరాల కోసం కాల్ చేయండి: RM KMM

image

లాజిస్టిక్స్(కార్గో) సేవల ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చూడాలని ఖమ్మం RM సరిరామ్ కార్గో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా రీజనల్ మేనేజర్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. KMM-9154298583, మధిర &సత్తుపల్లి-9154298585, భద్రాచలం-9154298586, KTDM-9154298587, మణుగూరు- 9154298588. కావున కార్గో సంబంధిత వివరాల కోసం పైన నెంబర్లకు సంప్రదించగలరు.

Similar News

News March 13, 2025

ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

image

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 13, 2025

ఖమ్మం: ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంల బదిలీ

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ డిప్యూటీ ఆర్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న జి.ఎన్.పవిత్ర, భవానీ ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ ప్రసాద్‌ను మహబూబ్‌‌నగర్‌కు, జీ.ఎన్.పవిత్రను షాద్‌నగర్‌‌కు బదిలీ చేశారు. కాగా, వీరి స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.

News March 13, 2025

భద్రాచలం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.

error: Content is protected !!