News June 27, 2024

కార్డులు లేక 10 ఏళ్లుగా ప’రేషన్’

image

ఖమ్మం: కొత్తరేషన్ కార్డుల కోసం పేదకుటుంబాలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనసభల్లో అత్యధికంగా కార్డుల కోసమే దరఖాస్తులు అందజేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రేషన్‌
కార్డులు ఇవ్వలేదు. అంతకుముందు జారీచేసిన కార్డుల ఆధారంగానే ఆన్‌లైన్‌లో
వివరాలు నమోదు చేశారు. 2021లో జిల్లాలో 12,216 మందికి కొత్త రేషన్‌ కార్డులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీఊసేలేదు.

Similar News

News July 1, 2024

రోడ్డుప్రమాదం, డీఏఓ పరీక్షలకు దూరమైన అభ్యర్థులు

image

సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.

News July 1, 2024

ఖమ్మం: చింత చిగురు కోస్తుండగా పాము కాటు, మహిళ మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.

News July 1, 2024

గతంలో పనిచేసిన లెక్చరర్లకు ఆహ్వానం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
వివిధ సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత ఉండడంతో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం, లెక్చరర్లను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ ఏడాది కూడా బోధన ప్రారంభించగా, గెస్ట్ లెక్చరర్లను సైతం విధుల్లో చేరాలని అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా, జిల్లాలోని 20 కళాశాలల్లో 58 గెస్ట్ లెక్చరర్లు, 8మంది పార్ట్ టైం, 29మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు.