News November 7, 2024

కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కమిషనర్

image

కర్నూలులో ఈ నెల 15న వినాయక ఘాట్‌ వద్ద నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్‌లో నగరపాలక, ఫైర్, విద్యుత్, ట్రాన్స్‌కో, జలవనరుల, మత్సకార, పోలీసు శాఖల అధికారులతో పాటు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్తీక దీపోత్సవం నాడు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Similar News

News December 26, 2024

శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

News December 26, 2024

శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2024

శ్రీశైలంలో 112.7 TMCల నీరు నిల్వ

image

శ్రీశైల డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 6,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రానికి 241, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,590, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాంలో 862.20 అడుగుల్లో 112.7164 టీఎంసీల నీరు నిల్వ ఉంది.