News November 5, 2025

కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

image

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.

Similar News

News November 5, 2025

పశువులకు రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది?

image

పశువుల్లో ఈ వ్యాధి ‘రేబీస్’ వైరస్‌వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన కుక్కలు, పిల్లులు, నక్కలు.. పశువులు, గొర్రెలు, మేకలను కరిచినప్పుడు రేబీస్ సోకుతుంది. అలాగే రేబీస్ సోకిన జంతువుల లాలాజలం, కంటి స్రావాలు.. పాడి పశువుల శరీరంపై ఉన్న గాయాలపై పడినప్పుడు కూడా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పశువుల పాలను సరిగా మరిగించకుండా తాగినా, మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి మనుషులకూ సోకే అవకాశం ఉంది.

News November 5, 2025

HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

image

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.

News November 5, 2025

హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.