News November 6, 2025
కార్తీక మాసం.. ధర్వేశిపురం ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

కార్తీక మాసం గురువారం సందర్భంగా నల్గొండ(D) కనగల్(M) ధర్వేశిపురం గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దయతో అందరికీ సర్వమంగళం కలగాలని భక్తులు ప్రార్థించారు.
Similar News
News November 6, 2025
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
News November 6, 2025
ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
SRSP UPDATE: 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 9 గంటలకు 4 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు వెల్లడించారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.


