News October 21, 2025
కార్తీక మాసం.. పార్వతీపురం మన్యం జిల్లాలో శైవక్షేత్రాలు సిద్ధం..!

రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని శైవక్షేత్రాలిల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
➤ అడ్డాపుశీలలో శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి
➤ గుంప వద్ద నాగావళి, జంఝావతి నదుల సంగమంలో సోమేశ్వరాలయం
➤ సాలూరులో పంచముఖేశ్వరాలయం
➤ ములక్కాయవలసలో విశ్వేశ్వరాలయం
➤ గుమ్మలో నీలకంటేశ్వర ఆలయం
➤ కురుపాంలో ధూళికేశ్వరాలయం
ఇవి కాకుండా మీకు తెలిసిన శైవక్షేత్రాలను కామెంట్ చెయ్యండి.
Similar News
News October 21, 2025
చేత్తో తినాలా.. స్పూన్‌తోనా.. ఏది సేఫ్?

విదేశీ కల్చర్‌కు అలవాటు పడి చాలామంది స్పూన్‌తో తింటుంటారు. అదే సేఫ్ అని భావిస్తుంటారు. కానీ అది అపోహేనని రీసెంట్ స్టడీస్ తేల్చాయి. ‘చేత్తో తింటే గాలి తక్కువగా లోనికి వెళ్లి గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలానే అన్నం-కూర బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, సహజత్వం, టైమ్ మేనేజ్మెంట్, ఫీల్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మన భారతీయ సంప్రదాయమని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?
News October 21, 2025
HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
News October 21, 2025
పర్వతగిరిలో కోతుల అత్యవసర సమావేశం..!

గ్రామాల్లో కోతులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను లాక్కెళ్తుంటాయి. వాటిని తరమడానికి వస్తే దాడి చేసి గాయపరుస్తుంటాయి. పంటలు, ఇంటి పెరట్లో వేసిన పండ్లు, కూరగాయల మొక్కలను ధ్వంసం చేస్తుంటాయి. పై ఫొటోను చూస్తే WGL(D) పర్వతగిరి(M)లో రేపటి కార్యక్రమం గురించి కోతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. కోతుల సమస్య మీ ఊర్లో ఉందా? ఇంతకీ సమావేశం దేనికోసమని అనుకుంటున్నారు?