News November 26, 2025

కార్పొరేటర్లు అందరూ పార్టీకి ద్రోహం చేశారు: కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ బిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

Similar News

News February 21, 2026

సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

image

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

News February 21, 2026

గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

image

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.

News February 21, 2026

నెల్లూరు: దశాబ్దాల కల’వరం’..!

image

డక్కిలి(M) ఆల్తూరుపాడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగు, సాగు నీటి కొరత నుంచి బయటపడవచ్చు. దశాబ్దాల కల కావడంతో అది తీరితే వారికి వరమే. ఈ ప్రాజెక్ట్ కింద సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను 56 KM మేరా చేపట్టాల్సి ఉండగా రూ. 733.778 కోట్లను పరిపాలన ఆమోదం కోసం పంపారు. అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.