News April 16, 2025

కార్పొరేట్ తరహా వైద్య సేవలు: MLA వీరేశం

image

పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయమని MLA వీరేశం అన్నారు. నకిరేకల్‌లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని పనులను పరిశీలించారు. 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 5 ఆపరేషన్ థియేటర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ వైద్యం తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని, ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

Similar News

News November 5, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.

News November 5, 2025

జేఎన్టీయూ-ఏ ఫార్మాడీ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఫార్మాడీ 3వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్17), ప్రీ-పీహెచ్‌డీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

News November 5, 2025

10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

image

పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, క్రైమ్‌తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.