News January 8, 2026

కార్పొరేషన్‌పై ఎమ్మెల్సీ సారయ్య అలక..!

image

మొన్నటి వరకు వరంగల్ పోలీసులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్‌‌పై ఫైర్ అవుతున్నారు. తమను కార్పొరేషన్ సమావేశానికి మాత్రమే పిలుస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు పిలువడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News February 5, 2026

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

image

దక్షిణ మధ్య రైల్వే(SCR)లో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు తెలియనివారు ఉండరేమో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును 1974లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. 52 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైలును ఫిబ్రవరి 2న అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

News February 5, 2026

కర్నూలులో పడిపోయిన ధరలు

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధరలు పడిపోయాయి. క్వింటా గరిష్ఠంగా రూ.9,200 చేరిన కందుల ధర తాజాగా రూ.8 వేల లోపు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.2,609, గరిష్ఠ ధర రూ.7,901కు అమ్ముడుపోయాయి. నిన్న మార్కెట్‌కు 3,655 క్వింటాళ్ల కందులు వచ్చాయి.

News February 5, 2026

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? ఇలా చేయండి..!

image

రైలులో ప్రయాణిస్తున్నారా..? ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాకుండా Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్నా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.