News September 26, 2024

కార్పొరేషన్ ఛైర్మన్లతో చంద్రబాబు సమీక్ష

image

నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదని, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు అని తెలిపారు.

Similar News

News February 13, 2026

GNT: జెడ్పీటీసీ విభజనపై కసరత్తు

image

ఉమ్మడి గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల పునర్విభజనపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. పల్నాడులో 28 జెడ్పీటీసీలు ఉండగా, గుంటూరు, బాపట్లలో కూడా విభజన పనులు కొనసాగుతున్నాయి. 3 జిల్లా పరిషత్‌లు ఏర్పడే అవకాశంతో ఛైర్మన్ పదవులపై నేతలు దృష్టి పెట్టారు. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీలలో ఓటర్ల జాబితాలలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

News February 13, 2026

GNT: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు కసరత్తు

image

గుంటూరు జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మార్చి 9 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచనలు అందుకున్నారు. 2026 జనవరి 1 నాటి డేటాను ఆధారంగా తీసుకుని గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తున్నారు. కాగా పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి.

News February 12, 2026

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పనులు (జి రామ్ జి పనులు) వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్ నిర్వహించారు. మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాలు విధిగా పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయుటకు ప్రతి రోజు, ప్రతి వారం వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆదేశించారు.