News December 31, 2025
కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం: ఏఐటీయూసీ

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ విశాఖలో గళమెత్తారు. ఈ కోడ్లు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా FEB 12న జరగనున్న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
Similar News
News January 2, 2026
విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
News January 2, 2026
నేడు GVMC స్థాయీ సంఘం సమావేశం

GVMC స్థాయీ సంఘం సమావేశం నేడు జరగనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం GVMC ప్రధాన కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి 87 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. IPRతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. గత సమావేశంలో వివాదాస్పదంగా మారిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు అంశం ఈసారి మళ్లీ అజెండాలో ఉండటంతో దానికి ఆమోదం లభిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
News January 2, 2026
మరో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న విశాఖ

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.


