News December 23, 2025

కార్మికుల క్రమశిక్షణే సింగరేణి బలం: డైరెక్టర్ సూర్యనారాయణ

image

కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకమే సింగరేణికి అసలైన బలమని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి జెండాను ఆవిష్కరించి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 28, 2025

WGL: ఎయిర్‌పోర్ట్ భూములు కబ్జా.. సర్వేకు నిర్ణయం

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన <<18691529>>706 ఎకరాల్లో కబ్జా<<>>కు గురైన 9.86 ఎకరాల భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశకు వచ్చిన సమయంలో ఈనెల 27న WGLకు వచ్చిన ఏఏఐ HYD విభాగం జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో ఏఐకి చెందిన భూములు పరిశీలించి, కబ్జా అయిన భూములను సర్వే చేయాలని కోరారు.

News December 28, 2025

REWIND: ఆదిలాబాద్‌లో అక్రమాలకు ఎస్పీ అడ్డుకట్ట

image

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా మార్చి 10న అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తన మార్కును చాటుతూ జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కృషి చేస్తున్నారు. జిల్లాలో ఈ ఎడాది రౌడీయిజం, భూ కబ్జాదారులు, వడ్డీ వ్యాపారులు, ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. మై ఆటో ఇస్ సేఫ్, ఆపరేషన్ చబుత్ర, పోలీస్ అక్క, రోడ్ సేఫ్టీ, సైబర్ నేరాల నియంత్రణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. గంజాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించారు.

News December 28, 2025

90 పైసలకే 50 ఎకరాలా: పేర్ని నాని

image

AP: చంద్రబాబు నోట PPP, P4 మాటలే వస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పీపీపీ టెండర్లకు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే వారు వ్యాపారం మాత్రమే చేస్తారనే విషయాన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు దోచుకుంటున్నారని, 90 పైసలకే 50 ఎకరాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సామాన్యులు, పేదల పట్ల చంద్రబాబు దృక్పథం మారట్లేదన్నారు.