News March 30, 2024
కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి: జడ్పీ చైర్మన్

బీఆర్ఎస్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాల పట్ల ములుగు జిల్లా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు ద్రోహులు మాత్రమే పార్టీ వీడుతున్నారని, దీంతో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
Similar News
News September 8, 2025
వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర నుంచి యధావిధిగా కార్మికులకే ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవికి CITU రాష్ట్ర కార్యదర్శి మాధవి ఈరోజు వినతి పత్రం అందజేశారు. మాధవి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, కార్మికులకు పని భద్రతను కల్పించాలని కోరారు.
News September 8, 2025
వరంగల్: ‘గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలి’

గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌లో బాధిత రైతులతో కలెక్టర్ సత్య శారదను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితుల రైతులందరూ కూడా చిన్న కారు రైతులని, ఈ భూమి పైనే వారి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.
News September 7, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం ఇలా..!

వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఖిలా వరంగల్ ప్రాంతంలో 56 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. గీసుకొండలో 38, దుగ్గొండి, సంగెం, నల్లబెల్లిలో 20 మి.మీ వర్షపాతం రికార్డయింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో వర్షం కురువలేదని, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరిలో ఓ మోస్తరుగా వాన పడింది.