News October 6, 2025
కార్వేటినగరంలో జోరుగా బెల్ట్ షాపులు.?

కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లో యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉ.5 గంటల నుంచి రా.11 వరకు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయట. మత్తులో విచ్చలవిడిగా వాహనాలు నడపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. ఇంతా జరుగుతున్నా అధికారులు, పాలకులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారట. మరి మీ ఏరియాలో బెల్ట్ షాపులు ఉన్నాయా.? ఉంటే వాటి నిర్వాహణ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News October 6, 2025
జిల్లాలో యూరియా నిల్వలున్నాయ్: కలెక్టర్

జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఆర్‌ఎస్‌కేలు, ప్యాక్స్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 186 మెట్రిక్ టన్నుల యూరియాను 1,945 మంది రైతులకు అందజేసినట్లు ప్రకటించారు. అదనంగా 166 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉన్నందున అవసరమైన రైతులు సమీప కేంద్రాలకు వెళ్లి పొందవచ్చని సూచించారు.
News October 6, 2025
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన నేపథ్యంలో, పార్కులో అత్యాధునిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్క్ నిర్మాణ పురోగతిపై సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News October 6, 2025
ఇది మన రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ

CJI BR గవాయ్‌పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులోనే CJIపై దాడి చేయడాన్ని ఖండించేందుకు మాటలు చాలడం లేదు. ఇది ఆయనపైనే కాదు.. మన రాజ్యాంగంపై దాడి. దేశమంతా ఐక్యమై ఆయనకు అండగా నిలబడాలి’ అని ప్రకటన విడుదల చేశారు. ఇది న్యాయవ్యవస్థ గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని, దేశంలో ఇలాంటి విద్వేషానికి చోటులేదని LoP రాహుల్ గాంధీ అన్నారు.