News January 31, 2026
కాలంలో విత్తనాలు కలలోనైనా పోయాలి

వ్యవసాయంలో విత్తనాలు చల్లడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది దాటిపోతే ఎంత కష్టపడినా పంట పండదు. కాబట్టి ఏవైనా అడ్డంకులు వచ్చినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పనిని అస్సలు విస్మరించకూడదు. అలాగే మన నిజ జీవితంలో కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. వాటిని మనం సకాలంలో అందిపుచ్చుకోవాలి. లేదంటే అవి చేయిదాటిపోయాక పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
Similar News
News February 18, 2026
భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన మెగాస్టార్

‘నా విజయ రహస్యం నీవే’ అంటూ భార్య సురేఖకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. 1980 ఫిబ్రవరి 20న వివాహ బంధంతో మొదలైన తమ ప్రయాణంలో భార్యే తన అతిపెద్ద శక్తి అని కొనియాడారు. ‘కుటుంబ బాధ్యతలన్నీ సురేఖ చూసుకోవడం వల్లే నేను వృత్తిపై దృష్టి పెట్టగలిగా. నా తల్లిదండ్రులకు ఆమె సొంత కూతురిలా నిలిచింది. సంక్షోభంలో, సంతోషంలో అండగా నిలిచిన సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
News February 18, 2026
‘హంప్ డే’ గురించి తెలుసా?

ఐదు రోజుల పని వారంలో బుధవారం సరిగ్గా మధ్యలో వస్తుంది. దీనిని ‘హంప్ డే’ అని పిలుస్తారు. ఒంటె మూపురం(హంప్)ను ఎక్కి దిగినట్లుగా బుధవారం దాటితే కష్టమైన పని వారం ముగిసి, వీకెండ్ వైపు ప్రయాణం మొదలైనట్లు ఉద్యోగులు భావిస్తారట. 1950లలో అమెరికాలో పుట్టిన ఈ పదం 2013లో ఒక వాణిజ్య ప్రకటన ద్వారా బాగా పాపులర్ అయ్యింది. దీన్ని సగం కష్టం తీరిందనే సంతోషానికి గుర్తుగా పరిగణిస్తారు.
News February 18, 2026
బామర్ లారీ 28 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<


