News February 26, 2026
కాలం చెల్లిన పదార్థాలు వాడొద్దు: కలెక్టర్

విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు.
Similar News
News February 27, 2026
YCP MLC బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్!

AP: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News February 27, 2026
358 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
ఏపీకి మరో కంపెనీ.. వివరాలివే

AP: జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ కంపెనీ రాష్ట్రానికి రానుంది. తిరుపతిలోని శ్రీసిటీలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనుంది. తొలి దశలో $77 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ పూర్తయ్యాక ఏడాదికి 30వేల టన్నులు ఉత్పత్తి చేయనుంది. జపాన్, యూఎస్ తర్వాత అమోర్ఫస్ మెటల్ కోసం ఏర్పాటయ్యే మూడో ప్లాంట్ ఇదే కావడం విశేషం.


